బాలకృష్ణప్రసాద్ గారి పాట ఇక్కడ వినండి.
http://www.esnips.com/urlapi/go/?URL=http://www.imesh.com/downloadmusic/?appid=142
|
సౌరాష్ట్రం
వీధుల వీధుల విభుఁడేగీ నిదె
మోదముతోడుత మొక్కరొ జనులు IIపల్లవిII
గరుడధ్వజ మదె కనకరథం బదె
అరదముపై హరి యలవాఁడె
యిరుదెసల నున్నారు యిందిరయు భువియు
పరఁగ బగ్గములు పట్టరో జనులు IIవీధులII
ఆడే రదివో యచ్చరలెల్లను
పాడేరు గంధర్వ పతులెల్లా
వేడుకతో వీడె విష్వక్సేనుఁడు
కూడి యిందరునుఁ జూడరో జనులు IIవీధులII
శ్రీవేంకటపతిశిఖరముచాయదె
భావింప బహువైభవము లవే
గోవిందనామపు ఘోషణ లిడుచును
దైవం బితఁడని తలచరో జనులు. IIవీధులII ౪-౨౮౬
5 comments:
మీ template బ్రహ్మాండంగా ఉంది.తెల్లవారుజామున్నే పెళ్ళికి వేరే ఊరికి పోతూ net on చేసి చూస్తే మొదట్లోనే మీ టపా కనిపించింది.బ్రాహ్మీ ముహూర్తంలో తిరుమల శ్రీనివాసుని దర్శనం అయినట్లుంది.ధన్యవాదములు.
Very nice song. You are a rockstar.
template అంత బ్రహ్మాడంగా తయారు చేసినది జ్యోతి గారు.ఆ డిజైన్ గొప్పదనమంతా ఆవిడకే చెందాలి.హృదయపూర్వక ధన్యవాదాలు బ్లాగు ముఖంగా జ్యోతి గారికి తెలియజేసుకుంటున్నాను.
పాటలను బ్లాగులో ఉంచడానికి సహాయం చేసిన మా అమ్మాయి సుజాతకు నా శుభాకాంక్షలు,శుభాశీస్సులు. sir అనే ఇంగ్లీషు పదం విడిచిపెడితే బాగుంటుందనిపిస్తుంది.
ఈ పాట నా అభిమాన రాగం శుద్ధసావేరిలో. thanx sir.
నాకు సంగీతం అసలు ఏమీ తెలుయదు.అన్నమయ్య ఆ సంకీర్తనకు నిర్దేశించిన రాగం సౌరాష్ట్రం.బాలకృష్ణప్రసాద్ గారు పాడినది శుద్ధసావేరి అయి ఉండొచ్చు.మీరు ఆయన పాడిన రాగం పేరు తెలిపినందుకు ధన్యవాదాలు.
Post a Comment