శ్రీరాగం
చెలులాల చూడరే చెలియ చక్కఁదనము
తలఁ చరా దింతంతని తలఁ చుకుండారాదు IIపల్లవిII
పోలుతమా జక్కవల పొలఁ తి చన్నులు నేఁ డు
పోలుచరా వవి పాయుఁ బొద్దుగుంకితే
మేలిమైన కురులు తుమ్మిదలని యందమా
ఆ లీల ననకు మవి యలుకు సంపెఁగలకు. IIచెలుII
యీడౌనా యీపెతొడ లేపున ననంట్లతో
యీడు గావు పొరపొచ్చే లెంచితే నవి
జోడు సేతమా మొగము సొరిదిఁ జంద్రునికిని
జోడుగాదు దినమొకజోకవాఁ డతడు . IIచెలుII
యెనసేతమా చిగురు యీపె కరపాదాలకు
యెనసేయ కొకవేళ ఇవి ముదురు
పెనతమా యీలేమను ప్రేమ శ్రీవేంకటేశుతో
పెనచనేల కూడిరి పెంపున నిద్దరును. IIచెలుII
ఇదో అందమైన సంకీర్తన। దీనిలో చెలికత్తెలు తమలో తామే ఇలా అనుకుంటున్నారట। ఓ చెలులారా చూడండే ! మన చెలియ(అలమేల్మంగ) చక్కదనము "ఇంతంత" అని తలచనూ రాదు-తలచకుండా ఉండనూరాదే।
నేడు ఈమె చనుగఁ వను జక్కవ పక్షులతో పోల్చుదామా? ఊహు! పొద్దు కుంకితే చాలు, అవి వెళ్ళిపోతాయిగా అంచేత పోల్చను వీలు పడదు.
పోనీ బంగారం లాంటి ఈపె కురులను తుమ్మిదలందామా? ఊహు! అలా అనొద్దు, అవి సంపెంగలకు భయపడతాయి.
ఈపె తొడలు ఆధిక్యంలో అరటి బోదెల కీడవుతాయని అందామా? అబ్బే ! పొరలు పొరలుగా ఉంటాయి అంచేత నవి వాటితో యీడు కావు.
పోనీ ఈమె మొఖాన్ని చందురునితో జోడు చేద్దామా అంటే అదీ జోడు కాదు ,రోజు కొక కళతో ఉంటాడాయె చందమామ।
ఆమె చేతులను పాదాలను చిగురుతో సమానమని అందామా అంటే అలా సమానము చేయటం కుదరదు ఎంచేతంటే ఒకవేళ ఇవి కొంచెం ముదురు।
యీ లేమను శ్రీ వేంకటేశ్వరుతో కలుపుదామా అంటే మనం కలిపేదేంటి ? వాళ్ళిద్దరూ కూడే ఉన్నారు.
Jun 26, 2008
చెలులాల చూడరే చెలియ చక్కఁదనము
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment