నానీలు ఐదొందలూ వెయ్యీ చెల్లవన్నారే! మరి రెండువేలకి చిల్లరా? నలుపు తెలుపవట మంటే వెయ్యి, రెండ యిదొందలు రెండు వేలవటమే ! మూడయిదొందలు బేంకులో ఇస్తే పదిహే నొందలు లే వన్నాడే! కొత్త యి దొందల్కి ఇంకోవారం పట్టుద్ది! అర్జెంటా? ఐదుకి నాలుగు - సరా!! జనధన్ ఎక్కవుంట్లో పాత నోట్లేస్తే బ్లాక్ వైటయి కులుక్కుంటుంది! కోట్ల బ్లాకెమవుంటయినా వైటు చెయ్యడం వెరీ ఈజీ | ||||||||||
బోల్డు జనాభా కదా!! |
Dec 6, 2016
నానీలు
Posted by
Unknown
0
comments
Mar 28, 2015
సుదర్శన రగడ తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు (సవరించిన పాఠం)
సుదర్శన రగడ ( ఛందస్సు: మధురగతి రగడ) ఓంకారాక్షరయుక్తము చక్రము సాంకనడిమి వలయాంతర చక్రము సర్వఫలప్రదసహజము చక్రము పూర్వపు కోణ ప్రపూర్ణము చక్రము హర నలువల దివిజాశ్రయ చక్రము గురుగతి రెండవ కోణపుఁ జక్రము స్రావ నిశాచర సంఘము చక్రము కోవిద మూడవ కోణపుఁ జక్రము రణ భయకర విరరాజిత చక్రము గుణయుత చతురపు కోణపుఁ జక్రము హుంకార రవ మహోగ్రపుఁ జక్రము కొంకని పంచమ కోణపుఁ జక్రము ఫట్కార పరబ్రహ్మము చక్రము షట్కోణాంతవిశాలపుఁ జక్రము బహళపటహరవభైరవ చక్రము మిహిరతుహినకరమిళితము చక్రము కఠినపవి నికర కల్పిత చక్రము శఠ మత ఖండన చతురము చక్రము దంభోళి నఖర దారుణ చక్రము గంభీర సమర కలితము చక్రము చండమరుత విస్తారిత చక్రము కుండలపతి ముఖ ఘోషిత చక్రము కాలధరుని శత కాండము చక్రము జ్వాలానల ముఖ శౌర్యము చక్రము విస్ఫురితపు చయ విభ్రమ చక్రము సాస్ఫాలితభుజ హారము చక్రము విద్యుత్కోటి నివేశము చక్రము ప్రద్యోతన మణిబంధము చక్రము సంభ్రమసంభృతిసహజము చక్రము బంభ్రమితవి దిక్పటలము చక్రము భద్రగజ ప్రభు పాలన చక్రము రుద్రైకాదశ రూపము చక్రము రక్షోగణ గళ రక్తము చక్రము భక్షిత దుష్టప్రాణము చక్రము కంఠధ్వని ఘన గర్జిత చక్రము లుంఠిత తిమిర విలోకన చక్రము రోదసి నిబిడ సురోచిష చక్రము వేద కుఱుకు గణ వేల్లిత చక్రము ప్రళయసమయ యమ భావము చక్రము దళితపు దురిత వితానము చక్రము వజ్రాయుధ బహువర్షుక చక్రము వజ్రపు ముత్య సువర్ణపుఁ జక్రము బ్రహ్మాది దివిజ పాలన చక్రము జిహ్మగ భూషణ జీవిత చక్రము షోడశ భుజ సంశోభిత చక్రము బాడబ వేయగు బంధుర చక్రము ప్రేంఖత్పరశు విభీషణ చక్రము శంఖ కటక శర చాపము చక్రము అసి గద ముమ్మొన వాలపు చక్రము ముసల హల రజి మోహన చక్రము అగ్నిః ఖేట వజ్రాయుధ చక్రము లగ్నసబళ శుభ లక్షణ చక్రము నేత్రత్రయవర్ణితగురు చక్రము రాత్రించరవిద్రావణ చక్రము జ్వాలాకేశవిశాలపుఁ జక్రము కాలవిషనిభకాంతుల చక్రము ఘూర్ణమగుమదవిగుంభిత చక్రము పూర్ణపుభక్తులపోషక చక్రము నిఘ్నం బాణకర నికర చక్రము విఘ్నాపహరణవిభవము చక్రము విహ్వలితనరకవీరము చక్రము రహువు గళసంహరణ చక్రము ముష్కరపౌండ్రనిమూలన చక్రము దుష్కరకర్మవిధూనన చక్రము నక్రపు కంఠపు విదళన చక్రము ధిక్కృతదనుజాతిక్రమ చక్రము దుర్వాసస్సంస్తుత్యము చక్రము శర్వరిపతి శత సంచయ చక్రము త్రిపురవిజయకరతీవ్రము చక్రము విపులనవరసనవీనము చక్రము మంత్రాధిపతిది మానిత చక్రము యంత్రసదనమధ్యాసిత చక్రము కుంజరపాలనగుణయుత చక్రము రంజితపుష్పపరాగము చక్రము సంధ్యారుణపటసంవృత చక్రము వంధ్యేతరగర్వస్ఫుట చక్రము మిథ్యావాదతిమిరహర చక్రము తథ్యామృతసంతర్పిత చక్రము కల్హారమాలికాధర చక్రము సిల్హధూపసంశ్లిష్టము చక్రము అర్కానలదీపాంచిత చక్రము మార్కండేయనమస్కృత చక్రము హవ్యకవ్యవివిధాశన చక్రము దివ్యమునివరధ్యేయము చక్రము వలయముమీదఁటవలగొను చక్రము బలవదష్టదళపద్మపుఁ జక్రము ఎడలఁగేసరము లెనసిన చక్రము వడినందుమీఁదివలయపుఁ జక్రము షోడశదళములసొంపగు చక్రము వీడని కీసర వితతుల చక్రము మొగిసిన మూఁడు వలయముల చక్రము తగుభూగోళముఁదనరిన చక్రము అంగపు మంత్రము లధికపుఁ జక్రము జంగిలి పదహా రచ్చుల చక్రము అనఘపు చక్రగాయత్రిక చక్రము తననిజమంత్రముదగిలిన చక్రము నరసింహమంత్రనామపుఁ జక్రము ధరనక్షరములదామెన చక్రము మహాసుదర్శనమంత్రము చక్రము విహరణవజ్రపు విధముల చక్రము అంబరనరసింహాక్షర చక్రము సాంబురుహాక్షరజాంకుశ చక్రము మానితదిక్పతిమంత్రము చక్రము నానావిధహరినామపుఁ జక్రము వేయువిధంబులవెలసిన చక్రము వేయంచులుగలవిశ్వపుఁ జక్రము భావించుసుజనపాలన చక్రము శ్రీవేంకటపతిచేతిది చక్రము. | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Posted by
Unknown
0
comments
Jan 14, 2015
నిన్ను గొలిచితేఁ జాలు నీయంతవానిఁ జేతువు
నాట
నిన్ను గొలిచితేఁ జాలు నీయంతవానిఁ జేతువు
పన్ని నారాయణ నీవు బ్రహ్మాదివంద్యుడవు.
భూపతిఁ జేరితేఁ గొంత భూమియ్య నోపుఁ గాని
యేపున నున్నత పద మియ్యలేఁడు
తీపుల నింద్రుని నారాధించితే స్వర్గమే కాని
యేపొద్దుఁ జెడని భోగ మియ్యలేఁడు.
గరళకంఠుఁ గొల్చితే కైలాస మీ నోపుఁ గాని
గరిమ ధ్రువపట్టము గట్టలేఁడు
సరి విరించిఁ గొల్చితే సత్యలోకమే కాని
విరజానది దాఁటఁగ వెళ్ళవేయలేఁడు.
అన్నిటా మాయాశక్తి నాశ్రయించి చూచితేను
నిన్నునాశ్రయించక కాన్పించనీదు
కన్ను లెదుట శ్రీవేంకటేశ నీ శరణం టే
యెన్నఁగా నీ విచ్చే యీవి యెవ్వఁడూ నీలేఁడు. 15-292
నిన్ను గొలిచితేఁ జాలు నీయంతవానిఁ జేతువు
పన్ని నారాయణ నీవు బ్రహ్మాదివంద్యుడవు.
భూపతిఁ జేరితేఁ గొంత భూమియ్య నోపుఁ గాని
యేపున నున్నత పద మియ్యలేఁడు
తీపుల నింద్రుని నారాధించితే స్వర్గమే కాని
యేపొద్దుఁ జెడని భోగ మియ్యలేఁడు.
గరళకంఠుఁ గొల్చితే కైలాస మీ నోపుఁ గాని
గరిమ ధ్రువపట్టము గట్టలేఁడు
సరి విరించిఁ గొల్చితే సత్యలోకమే కాని
విరజానది దాఁటఁగ వెళ్ళవేయలేఁడు.
అన్నిటా మాయాశక్తి నాశ్రయించి చూచితేను
నిన్నునాశ్రయించక కాన్పించనీదు
కన్ను లెదుట శ్రీవేంకటేశ నీ శరణం టే
యెన్నఁగా నీ విచ్చే యీవి యెవ్వఁడూ నీలేఁడు. 15-292
Posted by
Unknown
0
comments
Nov 9, 2014
నా తప్పటడుగులు లేక తప్పు టడుగులు
నేను అప్పుడప్పుడూ వ్రాసిన కొన్ని కంద పద్యాలూ మరియు ఓ ధృవకోకిలా వృత్తం.
కష్టం ముదిమియె కృష్ణా
కష్టం మరి జీవనమ్ము కాసులు లేకన్
కష్టతరం సుతు మరణం
కష్టం కష్టముల కెల్ల కాంచగ క్షుథయే!
ఇది ఓ సంస్కృత శ్లోకానికి అనువాదం.
నా ఇతర కందాలు.
కందం వ్రాసిన 'కవి' యేి
అందురు అందరును; కాని అందులొ అందం
చిందే పదాల పొందను
విందునుఁ గూర్చక కవగున? విమలేందు ముఖీ.
కవి నేను కానె కానూ
కవి కోకిల నాగఫణిని కవితతొ కొల్తున్
కవి మాడగుల కు నేనిదె
సవినయముగ నంజలింతు సభలో కన్నా.
ధారణ నిలుపగ జేసెడి
భారము నీ పైన నిలిపి పద్యాల్ చెబుతా
భారతి నా పై కరుణతొ
నర్తించుము నీవు నాదు నాలుక చివరన్.
సంపాదనొకటె ముఖ్యము
నింపాదిగ నలుపు తెలుపు సేయగ వచ్చున్
సంపాదించను లేకే
యింపుగ వల్లించు నీతు లసమర్థుడు తాన్.
ఇది నా అభిప్రాయం కాదు, కాని ప్రస్తుతం నడుస్తున్న లోక రివాజు.
పెద్దలు చెప్పిన సుద్దులు
బుద్ధులు విద్దెలును యెంతొ ముద్దుగ నుండున్
పెద్దలు వద్దని చెప్పిన
పద్ధతి యేపొద్దు వద్దు వద్దని యనరే.
స్నేహితులందరి లోనను
నీ హితమే కోరువారు నీ వారగుదుర్
ఆ హితులకు మేల్గూర్చే
స్నేహితునిగ శుభము కూర్చు స్నేహము తోడన్.
విద్యా గురు శుశ్రూష నె,
విద్యాధన మిచ్చి, లేక విద్యను యొసగీ,
విద్యను నేర్వగ వలయున్
విద్యను పొందగ మరియొక విధమే లేదే.
ఇంకా పూర్వం N.T.R గారు liquor policy ని ప్రకటించి నప్పుడెప్పుడో వ్రాసిన పద్యాల కొన్ని:
ప్రజలను మత్తున ముంచీ
ప్రజ ధనమును ప్రభు ధనముగ రయమున పెంచీ
ప్రజ లారోగ్యము త్రుంచీ
ప్రజలను నిర్వీర్యు జేయు ప్రతిమల వోలెన్.
వారుణి వాహిని పేరున
దారుణముగ రేట్లు పెంచి త్రాగెడు వారే
భారముగా బ్రతుకీడ్వగ
ఏరులు యేరులుగ సార వీథుల పారెన్.
ప్రజలకు జరిగే హానిన్
ప్రజలే గుర్తించి వారె ప్రతిఘటనలతో
హజముతొ ధర్నాల్ చేయన్
ప్రజ ఓట్ల కొఱకు చివరకు ప్రభుతయె దిగిరాన్.
సారాను 'బాను' చేసిరి
బీరున్ స్కాచ్ విస్కి బ్రాంది బేరరు లీయన్
యేరై పారగ సాగెను
సారా అయ్యమ్మెఫల్గ నాకృతి దాల్చెన్.
ఇంతలొ యెన్నిక లొచ్చెను
పంతముతో రామరావు ప్రతినను చేసెన్
అంతము చేసెద గంటలొ
సాంతముగా విస్కి బీరు సారా బ్రాందీల్.
ధృవకోకిల:
అతని మాటలు నమ్మి చేసిరి యాంధ్రు లాతని రాజు గాన్
అతడు కూడను వారి ఆశలు వమ్ము సేయక గంటలోన్
ప్రతిన చేసిన యట్టులే పరిపూర్ణ మద్య నిషేధమున్
అతివ లందరు మెచ్చగా యనుశాసనమ్మును తెచ్చెగా.
చివరి పద్యం మూడో పాదంలో యతి కురలేదు.
నెలలెనిమిది గడచిన విటు-------
ఇంక ఇక్కడినుండి కలం ముందుకు సాగలేదు.
Posted by
Unknown
0
comments
Jul 19, 2014
ఘనుడాతడా యితడు కలశాపురము కాడ
ఘనుడాతడా యితడు కలశాపురముకాడ హనుమంతుడితడా అంజనాతనయుడు పెడచేత లోచేత బెరసి కొందరిఁ గొట్టె అడరి దానవుల హనుమంతుడు బెడిదంపుఁ బెనుతోక బిరబిరఁ దిప్పి మొత్తె అడగ మాల్యవంతు హనుమంతుడు దాకాల మోకాల దాటించె కొందరి ఆకాశవీధి నుండి హనుమంతుడు పైకొని భుజములఁ బడఁదాకెఁ గొందరి ఆకడ జలధిలోన హనుమంతుడు అరుపుల నూరుపుల అందరిఁ బారగఁదోలె ఔరా సంజీవికొండ హనుమంతుడు మేరతో శ్రీవేంకటాద్రిమీది దేవుని బంటు ఆరితేరిన బిరుదు హనుమంతుడు ద్విరదగతి రగడ
ఘనుడాతడా యితడు కలశాపురముకాడ
హనుమంతుడితండా అంజనాతనయుండు పెడచేత లోచేత బెరసి కొందరిఁ గొట్టె అడరి దానవుల గొట్టెహనుమంతుడితండు బెడిదఁపుఁ బెనుతోక బిరబిర దిప్పి మొత్తెను అడగ మాల్యవంతు హనూమంతు డీతండు దాకాల మోకాల దాటించె కొందరిని ఆకాశవీధి నుండి హనుమంతుడితండు పైకొనిన భుజములతొ బడఁదాకి కొందరిన్ ఆకడ జలధిలోన హనుమంతుడీతండు అరుపులతొనూరుపుల అందరిఁ ని పోదోలె ఔర సంజీవికొండ హనుమంతుడితండు మేరతో శ్రీవేంకటాద్రి దేవుని బంటు ఆరితేరిన బిరుదు హనుమంతుడీతండు
గణ విభజన
|
Posted by
Unknown
1 comments
Subscribe to:
Posts (Atom)